Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వయసు వచ్చే అనుష్క అలా తయారవుతోంది...?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:02 IST)
సాధారణంగా ఎవరైనా ఏదైనా ప్రారంభించి ఆపేయడం మన చేతుల్లోనే ఉంటుందని అనుకొంటూ ఉంటారు. కానీ ఆ ఆపేయడం అనేది మన చేతులలో లేదు అనేది తర్వాత తర్వాత అనుభవం మీద తెలుస్తుంది. అది అబ్బాయిలకు సిగరెట్ సమస్య కావచ్చు... పెద్దవాళ్లకు మందు సమస్య కావచ్చు... హీరోయిన్లకు బరువు సమస్య కావచ్చు. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే... ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న అనుష్క కూడా ఇటీవలి కాలంలో ఈ బరువు సమస్యతో సతమతమవడమే. ఒక్క సినిమా కోసం తను చేసిన ఆ సాహసమో... లేదంటే యోగా ట్యూటర్‌ కాబట్టి పెరిగినంత సులభంగా తగ్గిపోవచ్చుననే ఓవర్ కాన్ఫిడెన్సో కానీ మొత్తంమీద అధిక బరువు సమస్య ఇప్పుడు ఆవిడ కెరీర్‌ని డైలమాలో పడేసింది. 
 
అయితే... బరువు తగ్గడానికి అనుష్క చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలిస్తున్నట్లు లేవు. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బరువు తగ్గి స్లిమ్‌గా మారినట్లయితే తన సినిమాలో అవకాశం ఇస్తానని దర్శకుడు అనుష్కకు ఓ ప్రామిస్‌ చేసారట! ఈ ఆఫర్‌ కాస్తా ఊరిస్తున్నా, ఇన్నాళ్లుగా తగ్గని బరువు రెండు నెలల్లో ఎలా తగ్గాలో మరి... స్వీటీనే చూసుకోవలసింది అని టాలీవుడ్‌ జనాలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరైతే... పెళ్లి వయసు వచ్చి దాటుతూ వుంటే అలా లావుగా మారిపోతారని అంటున్నారు. ఏది నిజమో మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments