Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఆ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న అనుష్క... పెళ్లి మాట ఎత్తితే...

అందం, అభినయం కలిపితే వచ్చే రూపం అనుష్క. ఈ స్వీటీ ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో ఏమో గాని ఈమెకు వచ్చిన అవకాశాలు ఇక ఏ హీరోయిన్‌కు దక్కలేదు. జేజెమ్మగా తన ఉగ్ర రూపాన్ని చూపించింది అనుష్క. అంతేకాదు రుద్రమదేవిగా కూడా కత్తి పట్టి కదనరంగంలోకి దూకింది

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (14:51 IST)
అందం, అభినయం కలిపితే వచ్చే రూపం అనుష్క. ఈ స్వీటీ ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో ఏమో గాని ఈమెకు వచ్చిన అవకాశాలు ఇక ఏ హీరోయిన్‌కు దక్కలేదు. జేజెమ్మగా తన ఉగ్ర రూపాన్ని చూపించింది అనుష్క. అంతేకాదు రుద్రమదేవిగా కూడా కత్తి పట్టి కదనరంగంలోకి దూకింది. దేవసేనగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
 
బాహుబలి సినిమా తరువాత అనుష్క పెద్దగా కనిపించలేదు. సైజ్ హీరో తరువాత అనుష్క కాస్త వళ్ళు చేసింది. దాన్ని తగ్గించుకునే పనిలో ఉంది అనుష్క. ఇప్పటికే కొన్ని కిలోల బరువు తగ్గిన అనుష్క సహజ పద్థతుల్లో బరువు తగ్గడం కోసం కేరళ ఆయుర్వేదంపై దృష్టి పెట్టింది. దీనికి కారణం లేకపోలేదు. ఆమెను ప్రభాస్ సాహో చిత్రంలో తీసుకుని ఆ తర్వాత వద్దని అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనితో ఎలాగైనా బరువు తగ్గేయాలని నిర్ణయానికి వచ్చేసిందట.
 
అందుకే కొన్ని నెలలుగా ప్రకృతి సిద్థమైన ఆయుర్వేద చికిత్సను కేరళలలోనే ఉంటూ వాడుతోందట అనుష్క. దీంతో కొత్త సినిమాలకు అనుష్క ఒప్పుకోవడం లేదు. ఆమె నటించిన భాగమతి సక్రాంతికి విడుదల కానుంది. అంతకుమించి అనుష్క చేతిలో ప్రస్తుతానికి ఎలాంటి చిత్రాలు లేవని సమాచారం. మరి పెళ్లి మాట ఎత్తితే మాత్రం ఇప్పుడే కాదని అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments