దక్షిణాది చిత్ర పరిశ్రమను సుచీ లీక్స్ ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్ల ప్రైవేట్ ఫోట్లు, న్యూడ్ వీడియోలను సుచీ లీక్స్ పేరుతో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి. ఇవి చిత్రపరి
దక్షిణాది చిత్ర పరిశ్రమను సుచీ లీక్స్ ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్ల ప్రైవేట్ ఫోట్లు, న్యూడ్ వీడియోలను సుచీ లీక్స్ పేరుతో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి. ఇవి చిత్రపరిశ్రమనే కాదు నటీనటుల గుండెల్లో కూడా రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూడ్ ఫిల్మ్ గురించిన వివరాలు కూడా లీక్ చేసిందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారిందట. హీరోయిన్ ఆండ్రియాతో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఓ న్యూడ్ ఫిల్మ్‌ను తీసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోనే ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
నిజానికి సినిమాలను తనదైన స్టయిల్లో విభిన్నంగా తెరకెక్కించడం కోలీవుడ్ దర్శకుడు సెల్వరాఘవన్‌కు మంచి దిట్ట. ఈమధ్యకాలంలో ఈయనకు ఆశించిన విజయం దక్కలేదు. కానీ... రీసెంట్‌గా సెల్వరాఘవన్‌కు సంబంధించి సుచీ లీక్స్ పేరుతో బయటకు వచ్చిన ఓ ఈ-మెయిల్ చర్చనీయాంశంగా మారింది.
నటి ఆండ్రియాతో సెల్వ రాఘవన్ న్యూడ్ సినిమాను తెరకెక్కించాడన్న సారాంశం ఈ మెయిల్‌లో ఉండటమే ఇందుకు అసలు కారణం. గాయని సుచిత్ర పేరుతో లీక్ చేసినట్లుగా భావిస్తున్న మెయిల్స్ గురించి పెద్ద చర్చే సాగుతోంది. ముందుగా దర్శకుడు సెల్వ రాఘవన్.. సింగర్ ఆండ్రియాకు పంపినట్లుగా చెబుతున్న ఒక మెయిల్ బయటికి వచ్చింది.
ఆ తర్వాత ఆండ్రియా.. సెల్వ భార్య గీతాంజలికి పంపినట్లుగా మరో మెయిల్ లీక్ అయింది. ఈమెయిల్‌లో ఆండ్రియా కొన్ని సంచలన విషయాలను పేర్కొందట. తనతో దర్శకుడు సెల్వ ఒక సినిమా మొదలుపెట్టాడని.. దాని పేరు 'ది ఘోస్ట్' అని ఆండ్రియా పేర్కొందట. పైగా, ఇదో రొమాంటిక్ మూవీ అని... దీని కోసం తనను దాదాపుగా నగ్నంగా చూపించారని ఆమె ఆ మెయిల్‌లో వివరించినట్టు టాక్.
అయితే, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో... సినిమాకు సంబంధించి తాను పారితోషికం కూడా తీసుకోలేదని ఆండ్రియా తెలిపింది. కానీ, ఇప్పటివరకు తీసిన సన్నివేశాలను సరిగ్గా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే అది ఒక ఆర్ట్ సినిమాలా ఉంటుందని... కానీ అలాగే నెట్లోకి వదిలేస్తే మాత్రం పోర్న్ మూవీలా ప్రచారం అవుతుందని ఆండ్రియా మెయిల్‌లో రాసినట్టు సమాచారం.
అలాగే, ఈ సినిమాను మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకుంటే తాను రెడీ అని... అలా కాకపోతే మాత్రం సినిమా ఫుటేజీని నాశనం చేయాలని ఆండ్రియా కోరిందట. ఇపుడు ఈ చిత్రం కోసం చిత్రీకరించిన ఓ సన్నివేశ వీడియోనే సోషల్ మీడియాలో రిలీజ్ అయినట్టు ఆండ్రియా టెన్షన్ పడుతోందట. దీనిపై క్లారిటీ రావాలంటే సెల్వరాఘవన్ లేదా ఆయన భార్య గీతాంజలి ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.