Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్యను మరిచిపోను.. రాసుకుంటే రాసుకోండి.. వెంట్రుకతో సమానం: రవి

బుల్లితెర యాంకర్ లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకలో సహ యాంకర్ రవి ఏడ్చేశాడని వార్తలొచ్చాయి. లాస్యను పక్కన బెట్టి శ్రీముఖితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రవితో బ్రేకప్ అయ

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:07 IST)
బుల్లితెర యాంకర్ లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకలో సహ యాంకర్ రవి ఏడ్చేశాడని వార్తలొచ్చాయి. లాస్యను పక్కన బెట్టి శ్రీముఖితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రవితో బ్రేకప్ అయ్యాక లాస్య వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే లాస్య-శ్రీముఖిలతో తన పేరును లింక్ చేస్తూ వస్తున్న రూమర్లపై సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన రవి కోపంగా సమాధానమిచ్చాడు. 
 
ఫ్యాన్స్ వేసిన కొన్ని ప్రశ్నలకు రవి సమాధానమిస్తూ.. లాస్యను మరిచిపోయే ప్రసక్తే లేదని, ఆమె మంచి స్నేహితురాలని రవి చెప్పాడు. తనతో టచ్‌లో ఉంటున్నానని, లాస్య త్వరలోనే ‘రాజా మీరు కేక’ అనే సినిమాతో మన ముందుకు వస్తుందని, ఆ సినిమా కోసం తాను కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. 
 
తనకు ఆమెకు ఏదో ఉందని నెగటివ్‌గా రాస్తున్నారు. నెగటివ్ విషయాలను తాను పెద్దగా పట్టించుకోను. నెగటివ్ వార్తలను వెంట్రుకతో సమానంగా తీసిపారేస్తానని చెప్పాడు. ఇక శ్రీముఖి తనకు మంచి కొలీగ్ అని, తామంతా షోలో భాగంగానే అలా బిహేవ్ చేస్తాం తప్ప, ముద్దులు పెట్టుకోవడం, తన్నుకోవడం వంటివి కేవలం షోలో భాగంగానే చేస్తాం తప్ప, వేరే ఉద్దేశం లేదని రవి చెప్పాడు. తమ గురించి నెగటివ్‌గా రాస్తే అది ప్రమోషన్‌కు పనికొస్తుందని, టీవీల్లో కనిపించే మా గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటారని.. అది నెగటివ్ అయినా తమకు ప్లస్సే అవుతుందని రవి అన్నాడు. 
 
ఇక బయట ఈవెంట్స్ కి కూడా తాము ముందుగానే మాట్లాడుకునే వెళ్తాం తప్పా, బయట వాళ్ళు అనుకున్నట్టు ఏమీ ఉండదని రవి తెలిపాడు. అంతే కాదు మేము పక్కా ప్రొఫెషనల్ అని కూడా ఆవేశంగా రవి చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments