ప్రముఖ యాంకర్ కమ్ యాక్టర్ లాస్యకు పెళ్లికూతురు కానుంది. ''రాజా మీరు కేక'' అనే సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న లాస్య త్వరలో పెళ్ళి కూతురు కానుందని.. తన సోల్ మేట్‌తో ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నంద
ప్రముఖ యాంకర్ కమ్ యాక్టర్ లాస్యకు పెళ్లికూతురు కానుంది. ''రాజా మీరు కేక'' అనే సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న లాస్య త్వరలో పెళ్ళి కూతురు కానుందని.. తన సోల్ మేట్‌తో ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని.. ప్రేమ విలువైందని.. పెళ్ళికి ముందు జరిగే ఎంగేజ్‌మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నదంటూ డిజైనర్ ఈశ్వరీ తయారుచేసిన ఎంగేజ్‌మెంట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్‌బుక్ ఫోటోలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసి సమంతలా.. ఈమెకు కూడా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా అంటూ నెటిజన్లు షాక్ తింటున్నారు.
అయితే ఈ ఎంగేజ్‌మెంట్ రీల్ లైఫ్‌లోనా.. రియల్ లైఫ్‌లోనా అనేది తెలియాల్సి వుంది. ఎందుకంటే తన ప్రియుడి పేరును లాస్య వెల్లడించకుండా సీక్రెట్‌గా ఉంచడమే కారణం. గతంలో లాస్య సహ యాంకర్‌తో ప్రేమలో ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి. అనంతరం మరో పోస్టు చేసిన లాస్య అందులో కంకణాలు కట్టుకున్న రెండు చేతుల ఫోటో పెట్టింది. ఆ చేతులపై చిన్ని. మంజు అన్న టాటూలున్నాయి. అయితే ఈ ఫోటోల సీనంతా సినిమా కోసమేనని కొందరు నెటిజన్లు కొట్టి పారేస్తున్నారు.