జబర్దస్త్ షో ద్వారా సెన్సేషన్ సృష్టించిన అందాల భామ అనసూయ ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా, క్షణం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా
జబర్దస్త్ షో ద్వారా సెన్సేషన్ సృష్టించిన అందాల భామ అనసూయ ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా, క్షణం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన అనసూయ ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా అవతారం ఎత్తనుంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది.
కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అప్పట్లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించని ఈ భామ.., ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ఆడి పాడేందుకు రెడీ అంటోంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్కు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అయితే మెగా ఫ్యాన్స్ అనసూయ ఎంపిక పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
మెగా హీరోలను ఛీ కొట్టిన వారిని మళ్లీ వారే చేరదీయడం వారికి అస్సలు నచ్చట్లేదట. గతంలో పవన్ కళ్యాణ్ సరసన ఐటెం సాంగ్‌లో నటించనని చెప్పేసిన.. అనసూయను మళ్లీ సాయి ధరమ్ తేజ్ చేరదీయడం ఏమిటని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.