Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయి ఇద్దరు పిల్లలున్న అనసూయకు రూ.40 లక్షలు కావాలట.. నిర్మాతలేమంటున్నారు?

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:52 IST)
బుల్లితెర‌పై అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించిన యాంక‌ర్ అన‌సూయ‌. 'జ‌బ‌ర్దస్త్' షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళుతుంది. రెండు సినిమాలు భారీ విజయం సాధించడంతో అనసూయ రెమ్యూనరేషన్‌ని అమాంతంగా పెంచేసింది. నాగార్జున మూవీ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో అనసూయ తన గ్లామర్‌తో కుర్రకారుని మత్తెక్కించింది. 
 
ఈ తర్వాత 'క్షణం' చిత్రంలో కీలకమైన పాత్రను పోషించింది. ఈ రెండు సినిమాల విజయాలతో మాంచి ఊపుమీదున్న అనసూయతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంటి ముందు క్యూ కడుతున్నారట. ఈ అవకాశాలను క్యాష్ చేసుకోడానికి ఈ యాంకరమ్మ రెడీ అవుతోందట. ఒక్క సినిమాలో న‌టించాలంటే రూ.40 ల‌క్ష‌ల‌కు ఒక్క రూపాయి కూడా త‌గ్గ‌డం కుదరదని ఈ అమ్మడు అంటోందట. దీంతో అన‌సూయ రేటు విన్న నిర్మాతలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయట. 
 
బుల్లితెర మీద హాట్ హాట్ యాంక‌ర్‌గా పేరున్న ఈ అమ్మ‌డు ఉంటే సినిమాకు క్రేజ్ వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో నిర్మాత‌లు ఆమె వెంట ప‌డుతుంటే ఆమె రేటు మాత్రం ఆకాశానికంటుతున్నాయి. పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మడికి నలభై లక్షలు ఇవ్వడం కంటే యంగ్‌ హీరోయిన్లు ఇరవై లక్షలకే వస్తుండటంతో దర్శకులు వారివైపు మొగ్గుచూపుతున్నారట. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే అవకాశాలు వస్తాయి… లేకపోతే టీవీషోలకే పరిమితం కావలసి వస్తుందని సినీ జనాలు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments