Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్- జయా బచ్చన్స్ విడిపోయారట.. వేర్వేరు బంగ్లాల్లో ఉన్నారట.. చెప్పిందెవరంటే.. అమర్ సింగ్?!

అందాల రాశి ఐశ్వర్యా రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ నుంచి విడిపోనుందని.. ఇటీవల ఓ సినిమాలో యంగ్ హీరో రణ్‌బీర్ సింగ్‌తో అమ్మడు చాలా క్లోజ్‌గా నటించడమే ఇందుకు కారణమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (16:22 IST)
అందాల రాశి ఐశ్వర్యా రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ నుంచి విడిపోనుందని.. ఇటీవల ఓ సినిమాలో యంగ్ హీరో రణ్‌బీర్ సింగ్‌తో అమ్మడు చాలా క్లోజ్‌గా నటించడమే ఇందుకు కారణమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలు నిజం కాదని.. ఈ జంట ఓ ఫంక్షన్‌లో ముద్దెట్టుకుంటూ కనిపించి నిరూపించింది. అలాగే అత్తతో కూడా ఐష్‌కు ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదలైన ఫోటోల ద్వారా తెలిసింది. 
 
అయితే తాజాగా బిగ్ బి అమితాబ్- జయా బచ్చన్‌ల గురించి ఓ వార్త బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ వార్త వెలువడింది. ఒకప్పటి బిగ్ బి స్నేహితుడు, రాజకీయ నేత అమర్ సింగ్ చెప్పారు. అదేంటంటే? బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, భార్య జయా బచ్చన్‌ విడివిడిగా జీవిస్తున్నారని అమర్‌ సింగ్‌ మంగళవారం షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 
 
కొద్ది సంవత్సరాల క్రితం అమితాబ్‌ దంపతులకు, అమర్‌సింగ్‌కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. జయను సమాజ్‌వాది పార్టీలో చేర్చుకోవద్దని అమితాబ్‌ తనకి వార్నింగ్‌ ఇచ్చారని గతంలో ఒకసారి అమర్‌ సింగ్‌ చెప్పారు. దానికి అమితాబ్‌ స్పందిస్తూ.. అమర్‌ తన స్నేహితుడని, అతడి అభిప్రాయం చెప్పే హక్కు అతనికి ఉందని అన్నారు. కానీ అమర్‌ సింగ్‌ తాజా వ్యాఖ్యలు మాత్రం అమితాబ్‌ అలా కొట్టిపడేసేలా లేవు. 
 
అమితాబ్- జయా బచ్చన్‌ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకుందని.. ఇటీవల అమితాబ్ బచ్చన్‌ను కలిసేందుకు వెళ్లానని అమర్ సింగ్ వెల్లడించారు. ఆ సమయంలో తాను ఓ విషయాన్ని గమనించానని.. బిగ్ బి జయా బచ్చన్‌లు విడివిడిగా జీవిస్తున్నారని.. వేర్వేరు బంగ్లాలలో వేర్వేరుగా ఉన్నట్లు అమర్ సింగ్ తెలిపారు. ఇందుకు కారణం ఐశ్వర్యా రాయ్- జయా బచ్చన్‌ల మధ్య ఏర్పడిన విభేదాలే కారణమని అమర్ సింగ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments