Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెంటికీ చెడ్డ రేవడిలా అమలా పాల్ .. ధనుష్ చిత్రం నుంచి ఔట్.. మరో భామకు ఛాన్స్?

మలయాళ బ్యూటీ అమలా పాల్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారయ్యేలా ఉంది. భర్త నుంచి విడిపోయేందుకు కోర్టు మెట్లెక్కిన ఈ భామకు ఇపుడు చేతిలో ఉన్న సినీ అవకాశాలు కూడా చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది.

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (15:46 IST)
మలయాళ బ్యూటీ అమలా పాల్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారయ్యేలా ఉంది. భర్త నుంచి విడిపోయేందుకు కోర్టు మెట్లెక్కిన ఈ భామకు ఇపుడు చేతిలో ఉన్న సినీ అవకాశాలు కూడా చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. 
 
నిజానికి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయంతెల్సిందే. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు భర్త అంగీకరించలేదు. కానీ, అమలాపాల్ మాత్రం అందుకు సమ్మతించకుండా, తమిళ హీరో ధనుష్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వారి కాపురంలో చిచ్చుపెట్టింది. 
 
ధనుష్ చిత్రం కోసం తన కాపురాన్ని కూడా ఫణంగా పెట్టిన అమలకు అనుకోని రీతిలో ఎదురు దెబ్బ తగిలినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఏ సినిమా కోసమైతే భర్తనూ, కాపురాన్నీ కాలదన్నుకుందో ఆ సినిమా నుంచి అమలను తప్పించారన్న వార్త బాగా హల్‌చల్‌ చేస్తోంది. 
 
అమల విషయంలో జరుగుతున్న గొడవలు చూసిన యూనిట్‌ ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాలని నిర్ణయించుకుందట! ఈ సినిమాలో అమలను కొనసాగిస్తే దాని ఫలితం సినిమా సక్సెస్‌ మీద పడుతుందేమోనన్న భయంతో చిత్రం యూనిట్‌ ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. యూనిట్‌ నిర్ణయం తెలుసుకున్న అమలకు దిమ్మతిరిగి పోయిందట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments