Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న అల్లు శిరీష్.. శ్రీరస్తు శుభమస్తు తర్వాత..?!

టాలీవుడ్‍‌లో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు పోయి ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్ల హవా నడుస్తోంది. స్టార్ హీరోలంతా ముగ్గురేసి భామలతో రొమాన్స్ చేస్తుంటే చిన్నహీరోలు కూడా...మేము కూడా ఎందులో తక్కువ మాకు మ

Webdunia
బుధవారం, 6 జులై 2016 (08:26 IST)
టాలీవుడ్‍‌లో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు పోయి ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్ల హవా నడుస్తోంది. స్టార్ హీరోలంతా ముగ్గురేసి భామలతో రొమాన్స్ చేస్తుంటే చిన్నహీరోలు కూడా...మేము కూడా ఎందులో తక్కువ మాకు ముగ్గురు హీరోయిన్లు కావాలంటున్నారు. వాళ్లల్లో అల్లు శిరీష్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం ''శ్రీరస్తు శుభమస్తు'' సినిమా చేస్తున్న అల్లు శిరీష్ ఆ తర్వాత ఎం.వి.ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. 
 
ఈ చిత్రంలో ఈ కుర్రాడి సరసన ముగ్గురు భామలు జోడి కట్టనున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరెవరో తెలుసా... ''కృష్ణ గాడి వీరప్రేమ గాథ''లో హీరోయిన్‌గా నటించిన మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఇప్పటికే ఎంపికైంది. మరో హీరోయిన్‌గా ''మోసగాళ్లకు మోసగాడు'' భామ నందిని రాయ్ పేరు వినిపిస్తోంది. ఇక మూడో హీరోయిన్ కోసం వెతుకులాట జరుగుతుంది.
 
ఇప్పటివరకు అల్లు శిరీష్ చేసిన రెండు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించిన అల్లు శిరీష్ రాబోయే సినిమాలో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటపెడుతున్నాడు. అల్లు అర్జున్ పూరి దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలతో సై అన్నట్టు.. ఈ సినిమాతో అల్లు శిరీష్ ముగ్గురు ముద్దుగుమ్మలతో సై అంటాడేమో.. ''శ్రీరస్తు శుభమస్తు'' పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ని చేయనున్నాడు. కుర్రాడి ఊపు చూస్తుంటే ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments