అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:03 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్... నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే... ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని ప్రారంభిస్తారా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.
 
ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. ఆ రోజు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అర‌వింద స‌మేత చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించారు. బ‌న్నీతో చేయ‌నున్న సినిమాకి కూడా త‌మ‌న్‌‍కే ఛాన్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌రి.. అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments