Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో పట్టాలెక్కనున్న 'డి.జె..దువ్వాడ జగన్నాథమ్‌'... భారీ బ‌డ్జెట్‌తో

''సరైనోడు'' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మా

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (15:58 IST)
''సరైనోడు'' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ''డి.జె..దువ్వాడ జగన్నాథమ్''. ఈ చిత్రంలో పూజాహెగ్దే కథానాయికగా నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జ‌రుగుతున్నాయి. 
 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం మొదలైంది. అల్లు అర్జున్ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. మరోపక్క... బన్నీ భార్య స్నేహారెడ్డి మరో నెలలో రెండో బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో బన్నీ షూటింగ్‌కు విరామం ఇవ్వనున్నారని... నవంబరులోనే ''దువ్వాడ జగన్నాథమ్‌''చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని పుకార్లు వినిపించాయి. 

అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ''డిజే బిగైన్స్'' అనే పోస్ట్‌తో టోటల్ క్లారిటీ ఇచ్చాడు బన్నీ. సినిమా క‌థ‌, క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్‌కాని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments