టాలీవుడ్ టాప్ హీరో, బాహుబలి కథానాయకుడు ప్రభాస్ కొణిదెల వారింటి అల్లుడు కాబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్లి
టాలీవుడ్ టాప్ హీరో, బాహుబలి కథానాయకుడు ప్రభాస్ కొణిదెల వారింటి అల్లుడు కాబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్లి ప్రభాస్-నిహారిక పెళ్లిపై చర్చించారని సోషల్ మీడియాను వార్తలు కుదిపేశాయి.. అయితే ఈ వార్తలకు ప్రముఖ నిర్మాత, అల్లు అరవింద్ ఫుల్ స్టాప్ పెట్టారు.
నిహారికకు పెళ్లి చేయాలనుకుంటే.. తమ ఫ్యామిలీలోనే వున్న హీరో అల్లు శిరీష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తామే తప్ప.. బయట వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ బయట హీరోలకు ఇవ్వాల్సి వస్తే సాటి హీరోలకు ఇచ్చేది లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. నిహారిక, అల్లు శిరీష్ పెళ్లి గురించి ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబుతో చర్చించినట్లు కూడా అల్లు అరవింద్ చెప్పారు.
కానీ నిహారికకు రెండేళ్ల గ్యాప్ ఇవ్వాలని.. ఆమెకున్న గోల్స్ పూర్తయ్యాక పెళ్లి పనులు ప్రారంభిద్దామని చిరంజీవి తెలిపినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. అంతేకానీ ప్రభాస్‌తో నిహారిక పెళ్లి, వేరొక హీరోతో పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.