Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే... ఆ లిస్ట్ ఇదో..

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (21:51 IST)
సాయి పల్లవి కెరీర్‌లో ఆమె నటించిన సినిమాల కంటే కథ, పాత్రల కారణంగా తిరస్కరించిన సినిమాలే ఎక్కువ.
స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే కథ, పాత్రల గురించి ఆలోచించకుండా చాలా మంది హీరోయిన్లు వెంటనే ఓకే చెప్పేస్తారు. 
 
నో చెప్పడానికి సంకోచిస్తారు. కానీ సాయి పల్లవి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కెరీర్‌లో సాయిపల్లవి నటించిన సినిమాల కంటే సాయిపల్లవి వదిలేసిన సినిమాల లిస్ట్ పెద్దది. చిరంజీవి, అజిత్, విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది హీరోల సినిమాలను సాయి పల్లవి తిరస్కరించింది. ఆమె తిరస్కరించిన సినిమాలు ఏంటి? అనేదానిని పరిశీలిస్తే.. 
 
చంద్రముఖి 2: లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన హారర్ మూవీ చంద్రముఖి 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ చంద్రముఖికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని దర్శకుడు పి.వాసు మొదట భావించారు.
 
భోళా శంకర్: భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో సాయి పల్లవి నటించాల్సి ఉంది. దర్శకుడు మెహర్ రమేష్ ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించాడు. అయితే సాయి పల్లవి మాత్రం ఈ సినిమాను తిరస్కరించింది. సాయి పల్లవి తప్పుకున్న ఈ పాత్రలో కీర్తి సురేష్ నటించింది.
 
డియర్ కామ్రేడ్: ఈ రెండు చిత్రాలే కాకుండా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది.
 
 ఇవి కాకుండా అజిత్ వలిమై, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, విజయ్ లియో సినిమాల్లో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ ఈ సినిమాల్లో ఆమె నటించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉదయం మూడు ముళ్లు వేయించుకుంది.. రాత్రికి ప్రాణాలు తీసుకుంది.... నవ వధువు సూసైడ్

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే- జర్నీకి రెండు గంటలే

వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య

Galla Jaydev: దేవుడు దయ ఉంటే తిరిగి టీడీపీలో చేరుతాను: జయదేవ్ గల్లా

ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం.. డమ్మీ బాంబును గుర్తించిన భద్రతా సిబ్బంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments