Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మ‌నం`కు సీక్వెల్ దిశ‌గా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌కుమార్‌

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (18:04 IST)
Akkineni Nagarjuna,manam
అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారు బ‌తికుండ‌గానే `మ‌నం` క‌థ‌తో గిఫ్ట్‌గా ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. దానితో అక్కినేని కుటుంబంతో ఆయ‌న‌కు ఎన‌లేని అనుబంధం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్ద లాభించ‌లేదు. `మ‌నం`లో అక్కినేని కుటుంబం మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించారు.

పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం ఇదే అయ్యింది. ఈ సినిమా తర్వాత అక్కినేని  అఖిల్తో ‘హలో’ అనే సినిమా చేశారు విక్రమ్. అది పాత‌క‌థే అవ‌డంతో పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.  నాని హీరోగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఆ సినిమాతోను ఆకట్టుకోలేకపోయారు. దాంతో మ‌ర‌లా పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్‌పై మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.
 
మ‌నం చేశాక‌, రామానాయుడు కుటుంబం క‌లిసేలా ఓ చిత్రాన్ని నిర్మించ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చినా అందుకు ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో చేయ‌లేక‌పోయిన‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. క‌నుక మరోసారి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారట విక్రమ్. ఈసారికూడా అక్కినేని కుటుంబంతోనే వుండ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

ముఖ్యంగా నాగార్జున , నాగ చైతన్య,  అఖిల్, స‌మంత‌, అమల, సుమంత్, సుశాంత్ ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటులందరితో ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ఆలోచనలో ద‌ర్శ‌కుడు వున్న‌ట్లు తెలుస్తోంది. ఆమ‌ధ్య స‌మంత న‌టించిన `ఓబేబీ`ని కూడా రిఫ‌ర్ చేస్తూ ఈ త‌ర‌హా కాన్సెప్ట్‌తో స‌రికొత్త‌గా వుండేలా ప్లాన్ చేయాల‌ని నాగార్జున సూచించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కాబ‌ట్టి అందుకు తగ్గ కథను దర్శకుడు సిద్ధం చేస్తున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లో మ‌రిని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని 457 అంగన్‌వాడీలలో రిలయన్స్ ఫౌండేషన్ ‘కహానీ కళా ఖుషీ’ ప్రచారం

కత్తితో పొడిచి మందుబాబు పరార్.. వీపులో కత్తి నాటుకుపోయింది.... (video)

ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

కాకినాడ సుబ్బయ్య హోటల్‌‌ ఫుడ్‌లో కాళ్ల జెర్రీ... ఎలా సీజ్ చేశారంటే? (video)

డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments