Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాడీ... మీ లవ్ వ్యవహారం నాకు ఎప్పుడో తెలుసు అన్నారు..: నాగ చైతన్య

అక్కినేని వారింట త్వ‌ర‌లోనే పెళ్లి భాజాలు మోగే టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఒక‌టి అనుకుంటే.. బై వ‌న్ గెట్ వ‌న్ ఫ్రీ ఆఫ‌ర్ లా రెండు ప్రేమల గురించి తెలిసింది. నాగ‌చైత‌న్య ల‌వ్, మ్యారేజ్ గురించి గుస‌గుస‌లు విని

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:35 IST)
అక్కినేని వారింట త్వ‌ర‌లోనే పెళ్లి భాజాలు మోగే టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఒక‌టి అనుకుంటే.. బై వ‌న్ గెట్ వ‌న్ ఫ్రీ ఆఫ‌ర్ లా రెండు ప్రేమల గురించి తెలిసింది. నాగ‌చైత‌న్య ల‌వ్, మ్యారేజ్ గురించి గుస‌గుస‌లు వినిపిస్తుండ‌గానే.. అఖిల్ కూడా సంద‌ట్లో స‌డేమియా అనుకున్నాడో ఏమో గానీ త‌న ప్రేమ గురించి కూడా ఇంట్లో చెప్పేశాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఏకంగా ఇంట్లో వాళ్ల‌కు ప‌రిచ‌యం కూడా చేసాడు. నాగ‌చైత‌న్య-స‌మంత ప్రేమ ఇప్పుడు ముదిరి పాకాన పడింది. వాళ్ల ప్రేమ‌కు నాగార్జున కూడా ఓకే చెప్పేశాడు. ఇక అఖిల్ ప్రేమ‌ను కూడా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. 
 
ఇప్ప‌టికే చిన్న కొడుకు ప‌రిచ‌యం చేసిన అమ్మాయికి అమ‌ల‌తో పాటు నాగ్ కూడా ఒప్పేసుకున్నారు. నాగ‌చైత‌న్య‌-స‌మంత నిశ్చితార్థం జ‌ర‌గ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక అఖిల్ నిశ్చితార్థం కూడా త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. మొత్తానికి క‌ళ్యాణ‌మొచ్చినా.. క‌క్కొచ్చినా ఆగ‌దంటే ఇదేనేమో కాబోలు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సంద‌డి లేకుండా ఉన్న అక్కినేని వారిళ్లు.. ఇప్పుడు ఒక్క‌సారిగా పెళ్లి భాజాల‌తో మోతెక్కిపోయేలా క‌నిపిస్తోంది. 
 
తాజాగా చైతూ మీడియాతో మరోసారి సమంత గురించి ప్రస్తావించాడు. ''సమంత, నేను ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నాం. ఈ విషయం నాన్నకు చెప్పా. దానికి ''నాకు ఎప్పుడో తెలుసు రా..'' అన్నారు. ఆ మాటకు నేను ఆశ్చర్య పడ్డాను. తన మనసును తండ్రి ఆ విధంగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించిదని అన్నాడు.

అలాగే తమ్ముడు అఖిల్ ప్రేమ గురించి చెబుతూ.. ''నా ప్రేమ గురించి చెప్పినప్పుడు పెద్దగా అనిపించలేదు కానీ అఖిల్‌ ప్రేమ గురించి చెప్పినప్పుడు అందరూ షాక్‌ అయ్యాం. చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. అయితే అఖిల్ మంచి నిర్ణయం తీసుకున్నాడు'' అని చెప్పుకొచ్చాడు చైతన్య. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments