Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌ పెళ్ళికి తర్వాతే.. చైతూ-సమ్మూ వివాహం? అన్నయ్య కంటే ముందే తమ్ముడు తాళి కట్టేస్తాడా?

అక్కినేని నట వారసులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌ల పెళ్ళి భాజాలు మోగనున్నాయి. అయితే అన్నయ్య చైతూ కంటే ముందు.. తమ్ముడు అఖిల్ పెళ్ళి జరుగుతుందని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌ ప్రేమ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (12:44 IST)
అక్కినేని నట వారసులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌ల పెళ్ళి భాజాలు మోగనున్నాయి. అయితే అన్నయ్య చైతూ కంటే ముందు.. తమ్ముడు అఖిల్ పెళ్ళి జరుగుతుందని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌ ప్రేమజంట నాగచైతన్య, సమంత వివాహం తేదీ దాదాపు ఖరారైందని.. దీన్నిబట్టి చూస్తే.. అఖిల్ వివాహం ముందు.. ఆపై చైతూ-సమ్మూ వివాహం జరుగనుందని టాక్ వస్తోంది. 
 
కాగా, డిసెంబర్ 9న అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ వివాహ నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించడంలో అక్కినేని నాగార్జున బిజీబిజీగా ఉన్నారు. అఖిల్ నిశ్చితార్థం డిసెంబరులో జరుగనుండగా, శ్రేయాభూపాల్‌తో అఖిల్ వివాహం మాత్రం రోమ్‌లో వచ్చే ఏడాది మేలో జరుగనుందని చైతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 
 
అయితే ఆగస్టు ఒకటో తేదీన నాగచైతన్య, సమంతల వివాహం జరగనుందని, తొలుత హిందూ సంప్రదాయంలో వివాహం జరిగిన అనంతరం క్రైస్తవ పధ్ధతిలో జరగనుందని సమాచారం. దీంతో అక్కినేని వారింట డిసెంబర్‌లో మొదలైన వివాహ సందడి ఆగస్టు వరకు కొనసాగేలా కనిపిస్తోంది. కానీ అఖిల్‌కు ముందు.. తర్వాత చైతన్యకు చేయడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సమ్మూ-చైతూల వివాహం ముగిశాక అఖిల్ వివాహం జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments