Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాయ్‌పై నెగిటివ్ ప్రచారం... కరణ్ జోహార్ పురమాయింపు

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌కు దర్శక-నిర్మాత కరణ్ జోహార్ దూరం పెరిగిందని అజయ్ దేవగణ్ వ్యాఖ్యానించడం బి టౌన్‌లో దుమారం రేపింది. గతంలో కరణ్ దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించిన కాజోల్ అతడితో స్నేహంగానే ఉంటూ

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (10:38 IST)
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌కు దర్శక-నిర్మాత కరణ్ జోహార్ దూరం పెరిగిందని అజయ్ దేవగణ్ వ్యాఖ్యానించడం బి టౌన్‌లో దుమారం రేపింది. గతంలో కరణ్ దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించిన కాజోల్ అతడితో స్నేహంగానే ఉంటూ వచ్చింది. వీళ్లంతా బాలీవుడ్‌లో ఒక గ్రూప్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కరణ్‌తో కాజోల్‌కు సాన్నిహిత్యం లేదని.. దీనికి వ్యక్తిగత కారణాలున్నాయని అజయ్ చెప్పుకొచ్చాడు. 
 
ఈ నెల 29న కరణ్ సినిమా ''యే దిల్ హే ముష్కిల్''తో పాటు అజయ్ సినిమా ''శివాయ్''లు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన శివాయ్, ఐశ్య‌ర్య రాయ్, ర‌ణ‌వీర్ క‌పూర్, అనుష్క శ‌ర్మ న‌టించిన క‌ర‌ణ్ జోహోర్ మూవీ యే దిల్ హై ముష్కిల్.. ఈ మూవీల మధ్య పోటీ నివారించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి.. దీంతో క‌ర‌ణ్ జోహోర్ స్వ‌యంగా రంగంలోకి దిగాడ‌ట‌. 
 
ఈ నేపథ్యంలో తమ పోటీ చిత్రమైన శివాయ్‌పై నెగిటివ్ ప్రచారం చేసి బురద జల్లమని కరణ్ జోహార్ పురమాయించాడు. దీంతో పాటు కరణ్ జోహార్ ''శివాయ్''సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయమని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్‌కు డబ్బులు ఇచ్చాడనే ఆడియో టేపులు బయటికివచ్చాయి. దీనిపై బహిరంగగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు అజయ్. ఈ నేపథ్యంలోనే కరణ్‌తో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది కాజోల్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments