Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాయ్ షూటింగ్ వల్ల నాకూ.. నా కుమార్తెకు మధ్య మాటల్లేవ్ : అజయ్ దేవగణ్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శివాయ్'. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగణ్ తన సొంత

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:10 IST)
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శివాయ్'. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగణ్ తన సొంత బ్యానర్ అజయ్ దేవగణ్ ఎఫ్‌ఫిల్మ్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం వహించారు.
 
ఇదిలావుంటే... అజయ్‌ దేవగణ్‌ కుమార్తె నైసా దేవగణ్ తన తండ్రితో సంవత్సరంపాటు మాట్లాడలేదట. ఈ విషయాన్ని అజయ్‌ "శివాయ్‌'' సినిమా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ''శివాయ్‌'' షూటింగ్‌ నిమిత్తం బిజీగా ఉండటంతో నా కుమార్తె కోసం సరిగ్గా సమయం కేటాయించలేకపోయేవాడ్ని. దాంతో తనకి కోపం వచ్చి దాదాపు ఏడాదిన్నర పాటు నాతో మాట్లాడలేదు. కానీ తను సినిమా ట్రైలర్‌, పాటలు చూశాక.. ''ఇప్పుడు నాకు తెలిసింది మీరెందుకు అంత బిజీగా ఉన్నారో, మీరు నా తండ్రి కావడం గర్వంగా ఉంది'' అని కితాబిచ్చింది. 
 
నా కుమార్తె ఇచ్చిన ఆ కాంప్లిమెంట్‌ నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా జీవితంలో అదే నాకు పెద్దది. ఇక సినిమా విషయానికి వస్తే తండ్రీకూతుళ్ళ మధ్య ఉన్న అనుబంధం చుట్టూ అల్లుకున్న కథ. నేను చాలా బాగా కనెక్ట్‌ అయ్యాను అని అజయ్‌ మీడియాతో అన్నారు. కాగా  ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments