Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 151వ సినిమా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఐశ్వర్యారాయ్ నటిస్తుందా?

ఖైదీ నెంబర్ 150 సినిమాకు హీరోయిన్లు దొరకక నానా తంటాలు పడిన మెగాస్టార్ చిరంజీవి.. తన 151వ సినిమా కోసం అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్‌ని ఖరారు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తన స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకా

Webdunia
బుధవారం, 3 మే 2017 (12:02 IST)
ఖైదీ నెంబర్ 150 సినిమాకు హీరోయిన్లు దొరకక నానా తంటాలు పడిన మెగాస్టార్ చిరంజీవి.. తన 151వ సినిమా కోసం అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్‌ని ఖరారు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తన స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోబో 1లో నటించిన ఐశ్వర్యను.. తన 151 చిత్రంలో నటింపజేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
 
ఖైదీతో రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిరంజీవి.. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో 151వది కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో చిరంజీవి సరసన ఐష్ నటించనుందని టాక్ వస్తోంది. కానీ దీనిపై సినీ యూనిట్‌ను ఎలాంటి స్పందన లేదు. ఐష్ కనుక చిరంజీవి సరసన నటిస్తే తెలుగులో ఫుల్ లెంగ్త్ సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రానికి చిరు తనయుడు చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

శత్రువు పాకిస్థాన్‌ను ఇలా చితక్కొట్టాం : వీడియోను రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments