Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ప్లాస్టిక్ అని వ్యాఖ్యానించారు... అందుకే ఇమ్రాన్ హష్మితో నటించను : ఐశ్వర్యా రాయ్

''జజ్బా'' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐశ్వర్య రాయ్.. ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో తన రెండో చిత్రం 'సరబ్ జిత్'తో సత్తా చాటాలని గట్టిగానే ట్రై చేసింది ఈ మాజీ విశ్వసుందర

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (11:41 IST)
''జజ్బా'' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐశ్వర్య రాయ్.. ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో తన రెండో చిత్రం 'సరబ్ జిత్'తో సత్తా చాటాలని గట్టిగానే ట్రై చేసింది ఈ మాజీ విశ్వసుందరి. కానీ మళ్లీ అమ్మడికి చుక్కెదురైనట్టేనని వినిపిస్తోంది. ఇటీవలే విడుదలైన 'సరబ్ జిత్'లో ఐష్ నటన ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ జైల్లో అన్యాయంగా మగ్గిపోయి ప్రాణాలు విడిచిన సరబ్‌జిత్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో.. టైటిల్ రోల్‌ను రణ్‌దీప్ హూడా పోషించగా, అతడి సోదరి దల్బిర్‌గా ఐశ్వర్య నటించింది. 
 
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేసుకుంటూ పోతుంది. కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో సినిమాలు చేసుకుంటూ వెళుతుంది ఐశ్వర్య. ఇదే కోవలో తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అజయ్ దేవ్‌గన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''బాద్‌షాహో''. ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన ఐశ్వర్య తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకుందట. 
 
ఇందుకు ముఖ్యకారణం ఇందులో మరో నటుడు ఇమ్రాన్‌ హష్మి నటించడమే. ఈ మూవీలో ఇమ్రాన్‌కి జంటగా ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ని తీసుకున్నారు. అయితే ఇమ్రాన్‌తో కలిసి చాలా సన్నివేశాల్లో కలిసి నటించాల్సి ఉంటుంది అని దర్శకుడు మిలాన్‌ లుత్రియా ఐష్‌కి చెప్పడంతో వెంటనే నిరాకరించిందట. ఇలా తప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే.. నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ చేస్తున్న ''కాఫీ విత్‌ కరణ్‌’ షోకి ఇమ్రాన్‌ వచ్చినప్పుడు ఐష్‌ని ''ప్లాస్టిక్'' అంటూ కామెంట్‌ చేశారట. దీంతో అప్పటి నుంచి ఐష్‌ ఇమ్రాన్‌పై కోపంగా ఉందని… అందుకే ఇమ్రాన్‌ పక్కన నటించడానికి ఒప్పుకోలేదని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments