Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌కి అమ్మ‌గా న‌టిస్తున్న 'నిన్నేపెళ్లాడుతా' తార..

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (22:04 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ సినిమా రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని ఎనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు.  ఉగాది రోజున (ఏప్రిల్ 6) ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. 

అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ నాయికగా పూజా హెగ్డే ఎంపిక చేసారు. తాజా వార్త ఏంటంటే.. అర్జున్ తల్లి పాత్రకు టబు నటించే అవకాశాలున్నాయనే ప్రచారం గుప్పుమంది. ఇప్పటికే టబును త్రివిక్రమ్ సంప్రదించి కథ వినిపించాడనీ, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అనీ వినిపిస్తోంది. అయితే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుందని త్రివిక్ర‌మ్ న‌మ్మ‌కంగా ఉన్నార‌ట‌. 18 సంవత్సరాల క్రితం వెంకటేష్ కి జంట‌గా నటించిన కూలీ నెం 1తో తెలుగు సినిమాల్లోకి నాయికగా ఆమె అడుగుపెట్టింది.
 
నాగార్జున సరసన చేసిన నిన్నే పెళ్లాడుతా సినిమాతో యూత్‌లో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రేమదేశం సినిమాతో లక్షలాదిమందిని తన ప్రేమలో పడేసింది టబు.  ఆమె తెలుగులో నటించిన చివరి సినిమా చంద్రసిద్ధార్థ్ డైరెక్ట్ చేసిన ఇదీ సంగతి. మ‌రి..ఈ సినిమాకి ఆమె ఓకే చెబుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments