Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెస్ట్ రోల్స్‌కే పరిమితమౌతున్న సమంత.. అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీ.. సావిత్రిలో కూడా?

పెళ్లికి ముందే టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతలతో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాలో ముందుగా సమంతనే హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (11:59 IST)
పెళ్లికి ముందే టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతలతో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాలో ముందుగా సమంతనే హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే సమంత వద్దని, మరో హీరోయిన్‌ను తీసుకోమని చైతూనే డైరెక్టర్‌కు చెప్పాడట.

అభిమానులు కూడా చై, సామ్‌ కలిసి నటిస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా రిక్వస్ట్ చేశారట. అయితే సమంత మాత్రం నాగచైతన్యతో మరో సినిమా కచ్చితంగా చేస్తానని, అయితే ఆ సినిమా మాత్రం తమ పెళ్లి తర్వాతే ఉంటుందని సూటిగా చెప్పింది.
 
ఇకపోతే.. నాగ చైతన్యతో నిశ్చితార్ధం అయిన తర్వాత సమంత తన సినీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తోంది. అటు అక్కినేని ఫ్యామిలీకి ఇటు సినీ కెరీర్‌కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా కథలను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటోంది. ఇంతకుముందు ఒప్పుకున్న తెలుగు, తమిళ సినిమాల నుంచి కూడా తప్పుకుంది. తాజాగా రాజుగారి గది-2, సావిత్రి సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో నటిస్తోంది.
 
రాజుగారి గది-2లో సమంత పాత్ర చిన్నదే అయినా ప్రతీ సన్నివేశం ఉద్వేగంతో కూడుకున్నదై ఉంటుందట. అలాగే సమంత పాత్రను దర్శకుడు ఓంకార్ చక్కగా తెరకెక్కించనున్నాడట. అలాగే సావిత్రి బయోపిక్‌లో సమంత.. జమున పాత్రని పోషిస్తోంది. ఇప్పటివరకు సమంత ఒప్పుకున్న పాత్రలన్నీ గెస్ట్ రోల్స్ అయినా అవి స్పెషల్ రోల్స్‌గా నిలిచిపోతాయని టాక్ వస్తోంది. 
 
అలాగే నాగశౌర్య నటిస్తున్న అమ్మమ్మ గారి ఇల్లు సినిమాలో కూడా సమంత గెస్ట్ రోల్ చేయనుందట. కథాపరంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండడంతో సమంత వెంటనే ఓకే చెప్పేసిందట. మొత్తానికి సమంత హీరోయిన్ రోల్స్‌ను పక్కనబెట్టి.. కేవలం గెస్టు పాత్రలకే పరిమితం కావడం ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయినా.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సమ్మూ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. సమంత అక్కినేని ఇంటి కోడలుగా.. అమల వారసురాలిగా మంచి పేరు కొట్టేస్తుందని ప్రశంసిస్తున్నారట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments