Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజనటికి కోపమొచ్చింది.. సినిమా సెట్స్‌ నుంచి జయసుధ వాకౌట్‌!

నిత్యం ప్రశాంతవదనంతో.. నవ్వుతూ కనిపించే సహజనటి జయసుధకు కోపమొచ్చింది. దీంతో ఆమె సినిమా సెట్స్ నుంచి వాకౌట్ చేసింది. తాజాగా జరిగిన ఈ సంఘటన ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అసలు జయసుధ సినిమా సెట

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (14:07 IST)
నిత్యం ప్రశాంతవదనంతో.. నవ్వుతూ కనిపించే సహజనటి జయసుధకు కోపమొచ్చింది. దీంతో ఆమె సినిమా సెట్స్ నుంచి వాకౌట్ చేసింది. తాజాగా జరిగిన ఈ సంఘటన ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అసలు జయసుధ సినిమా సెట్స్ నుంచి వాకౌట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
‘బిచ్చగాడు’ సినిమాను తెలుగులో విడుదల చేసిన చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత, దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న ఆర్‌.నారాయణ మూర్తికి జోడీగా నటిస్తోంది జయసుధ. అయితే షూటింగ్‌ స్పాట్‌కు వచ్చే సమయం విషయంలో జయసుధ, నిర్మాత గొడవపడినట్టు తెలుస్తోంది. జయసుధ ఏ సినిమా షూటింగ్‌కైనా ఉదయం పది గంటలకే హాజరవుతుందట. 
 
ఈ సినిమాకూ అలాగే 10 గంటలకు వస్తున్నారు. దీంతో నిర్మాత శ్రీనివాసరావు ఆమెను నిలదీశాడట. ఎంతపెద్ద సీనియర్‌ నటులైనా తన షూటింగ్‌ స్పాట్‌లో 8:45కల్లా ఉండాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చాడట. అలాగైతే తనకు కుదరదని, ఈ సినిమా చేయనని చెప్పిందట జయసుధ. 
 
నిర్మాత కూడా కాస్త కఠినంగా మాట్లాడినట్టు వినికిడి. దీంతో జయసుధ కోపంగా ఆ సినిమా చేయనని చెప్పి సెట్‌ నుంచి ఇంటికి వెళ్లిపోయిందట. ప్రస్తుతం నిర్మాతకు, జయసుధకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలువురు సినీ పెద్దలు రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments