Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన మనవరాలు చిక్కుకుందని.. తన మనవరాలిని రక్షించాలని కోరింది. సాలిగ్రామంలో నివసిస్తున్న కృష్ణకుమారి గత మంగళవారం చెన్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (10:20 IST)
శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన మనవరాలు చిక్కుకుందని.. తన మనవరాలిని రక్షించాలని కోరింది. సాలిగ్రామంలో నివసిస్తున్న కృష్ణకుమారి గత మంగళవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఓ ఫిర్యాదు అందజేస్తూ... ‘పిరందాచ్చు’ అనే చిత్రంతో నా మనవరాలు బాబీలోనా సినిమాల్లోకి ప్రవేశించిందని, ఆమెను ఉన్నత స్థాయికి చేర్చేందుకు తానెంతో కృషి చేశానని పేర్కొన్నారు. 
 
అయితే ఆరణి ప్రాంతానికి చెందిన సుందర్‌ పాల్‌రాజ్‌ అనే వ్యక్తి తాంత్రిక చర్యలతో తన మనవరాలు బాబీలోనాని వశం చేసుకొన్నాడని, అతడి చెర నుంచి తన మనవరాలిని విడిపించాలని కృష్ణకుమారి పోలీసులను కోరారు. ఓ జిమ్‌లో పరిచయమైన సుందర్‌ పాల్‌రాజ్‌తో ప్రేమలో పడిన బాబీలోనా గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే తామిద్దరికీ వివాహం అయిపోయిందని.. కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదును కొట్టేయాలని బాబీలోనా పోలీసులను కోరారు. భర్త పైనే ఫిర్యాదు చేయడంపై ఆమె బామ్మపై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments