Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్‌‍గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ... ఫోటోలు వైరల్!!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (16:42 IST)
హీరోయిన్ తాప్పీ సీక్రెట్‌గా తన ప్రియుడిని రహస్యంగా పెళ్లాడినట్టు సమాచారం. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెన్మార్క్‌ దేశానికి చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోతో ఆమె చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెల్సిందే. సుమారుగా వీరిద్దరూ పదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే, ఈ ప్రేమపక్షులు తాజాగా వివాహ బంధంతో ఒక్కటైనట్టు తెలుస్తుంది. మార్చి 20వ తేదీన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకుని, 23వ తేదీన ఉదయ్‌పూర్ కోటలో తాప్సీ - మథియోస్‌ల వివాహం చేసుకున్నట్టు సమాచారం. అయితే, ఈ వివాహానికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. అలాగే, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, సినీ నిర్మాత కనిక కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల కింద నా స్నేహితుల పెళ్లిలో అంటూ కామెంట్స్ చేశారు. దీంతో కనికి ఈ పెళ్లికే వెళ్లివుంటుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా, ఈ వేడుకకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే, ఈ వివాహంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. 
 
మరోవైపు, తెలుగులో కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ సొట్టబుగ్గల సుందరికి టాలీవుడ్ ఏమాత్రం అచ్చిరాలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌కు వెళ్లిపోయి, అక్కడ నిలదొక్కుకున్నారు. ఆమె నటించిన పలు బాలీవుడ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తాప్సీ అక్కడే స్థిరపడిపోయింది. అదేసమయంలో టాలీవుడ్‌పైనా, దర్శకుడు, రాఘవేంద్ర రావుపైనా కూడా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Video)

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments