భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా ‘బాహుబలి-2’లో కుమారవర్మగా సుబ్బరాజు మెప్పించిన విషయం తెలి
భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి అనుకోకుండా వచ్చి అనుకోకుండా నటుడైపోయిన వ్యక్తి సుబ్బరాజు. అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా ‘బాహుబలి-2’లో కుమారవర్మగా సుబ్బరాజు మెప్పించిన విషయం తెలిసిందే. ఈయనకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు బెస్ట్ ఫ్రెండ్. పూరీతోనే కాదు ఆయన భార్య లావణ్యకు కూడా సుబ్బరాజు అంటే చాలా అభిమానం.
ఈ అభిమానంపై సుబ్బరాజు స్పందిస్తూ... ‘లావణ్య వదినకు నేనంటే చాలా అభిమానం. అందుకే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని పూరీని అడిగేది. దాంతో ఓ సారి పూరీ మా ఇద్దరినీ కూర్బోబెట్టి.. ‘సుబ్బూ కోసం కథ రాయడం, నిర్మాతను వెతకడం.. ఇవన్నీ చాలా కష్టం. అంత కష్టం నేను పడలేను. అయితే సుబ్బూను హీరోగా చూడాలన్న నీ కోరిక తీరాలంటే ఓ మార్గం ఉంది’ అంటూ ఓ కథ వినిపించారు. అందులో నేనే హీరో. అంటే ఆ సినిమాలో నాది సినిమా హీరో పాత్ర. ఆ సినిమా ‘నేనింతే.’ అలా నన్ను హీరో చేశాడు పూరి’ అని సుబ్బరాజు చెప్పుకొచ్చాడు.