Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు వివాహేతర సంబంధం ఉంది.. అందుకే వదిలించుకున్నా : హీరో ప్రశాంత్

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకు విడాకులు ఇవ్వడాన్ని తమిళ, తెలుగు చిత్రాల హీరో ప్రశాంత్ సమర్థించుకున్నారు. ఆమెకు మొదటి భర్తతో వివాహేతర సంబంధం ఉందని అందుకే కోర్టు ద్వారా వదిలించుకున్నట్టు వెల్లడించారు.

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:11 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకు విడాకులు ఇవ్వడాన్ని తమిళ, తెలుగు చిత్రాల హీరో ప్రశాంత్ సమర్థించుకున్నారు. ఆమెకు మొదటి భర్తతో వివాహేతర సంబంధం ఉందని అందుకే కోర్టు ద్వారా వదిలించుకున్నట్టు వెల్లడించారు. పైగా, తనను మోసం చేసి వివాహం చేసుకుందని ఆరోపించారు. 
 
గతంలో 'తొలిముద్దు', 'ప్రేమఖైదీ', 'జీన్స్' వంటి చిత్రాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో ప్రశాంత్. ఈయన గత 2005లో అతడు గృహలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అయితే, ఈయన ఇటీవలే తన భార్య గృహలక్ష్మికి విడాకులు ఇచ్చారు. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రధాన కారణాన్ని హీరో బహిర్గతం చేశారు. 
 
తన మాజీ భార్య గృహలక్ష్మికి అంతకుముందే పెళ్లైనా ఆమె దాచి తనను మోసం చేసిందని ఆరోపించారు. అంతేకాదు.. ఆ వ్యక్తితో ఇప్పటికీ ఆమె వివాహేతరసంబంధం నెరుపుతోందని చెప్పారు. ఈ ఆరోపణలతోనే విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకెళ్లి.. విడాకులు పొందినట్టు వివరించారు. 
 
తాజాగా గృహలక్ష్మి కూడా ఈ విడాకులపై నోరు విప్పిందట. ప్రశాంత్‌ను తాను మోసం చేయలేదని పేర్కొంటూ విడాకుల తీర్పును పైకోర్టులో సవాల్ చేసిందని కోలీవుడ్ వర్గాల టాక్. పైకోర్టు కూడా ఆమె వాదనను తోసిపుచ్చి... ఆమె నుంచి ప్రశాంత్ విడిపోవడమే కరెక్టని తీర్పునిచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments