Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగోసారి.. ఐశ్వర్యారాయ్‌తో మణిరత్నం కొత్త సినిమా

మణిరత్నం, ఐశ్వర్యా రాయ్.. ఈ రెండు పేర్లు వినగానే దక్షిణాది ప్రేక్షకులలో అందరికీ గుర్తు వచ్చే సినిమా ఇరువర్ లేక్ ఇద్దరు మిత్రులు చిత్రం. ఎంజిఆర్ ప్రేయసిగా జయలలిత పాత్రలో మెరిసిన ఐశ్వర్యారాయ్ పాత్రకు మణిరత్నం ఇరువర్ సినిమాలో ప్రాణ ప్రతిష్టచేసి చిత్రించ

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (05:02 IST)
మణిరత్నం, ఐశ్వర్యా రాయ్.. ఈ రెండు పేర్లు వినగానే దక్షిణాది ప్రేక్షకులలో అందరికీ గుర్తు వచ్చే సినిమా ఇరువర్ లేక్ ఇద్దరు మిత్రులు చిత్రం. ఎంజిఆర్ ప్రేయసిగా జయలలిత పాత్రలో మెరిసిన ఐశ్వర్యారాయ్ పాత్రకు మణిరత్నం ఇరువర్ సినిమాలో ప్రాణ ప్రతిష్టచేసి చిత్రించారు. ఆ సినిమా ప్రభావంతో మణిరత్నం అంటే అపార గౌరవం పెంచుకున్న ఐశ్వర్యా రాయ్.. మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి తానెప్పుడూ సిద్ధమే అని నటి ఐశ్వర్యారాయ్‌ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గురు, రావణన్‌ చిత్రాలు వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాయి.
 
ఈ అందగత్తెను కోలీవుడ్‌కు ఇరువర్‌ చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు మణిరత్నం మరోసారి ఈ మాజీ ప్రపంచ సుందరికి తన సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో మరోసారి మాజీ ప్రపంచ సుందరి నటించనున్నారా అన్న ప్రశ్నకు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాధానం కోలీవుడ్‌లో వస్తోంది. మరోసారి అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ దంపతులతో చిత్రం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు టాక్‌.
 
ఈ  ఆ మధ్య రణబీర్‌కపూర్‌కు జంటగా హే దిల్‌ హై ముష్కిల్‌ చిత్రంలో ఐశ్వరాయరాయ్‌ చాలా సన్నిహితంగా నటించారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిషేక్‌ బచ్చన్‌ ఐశ్వర్యారాయ్‌ల మధ్య విభేధాలు తలెత్తి పరిస్థితి విడిపోయే వరకూ రాగా సన్నిహితులు పూనుకుని ఇద్దరికి నచ్చజెప్పి చక్కపరచినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో అభిషేక్‌బచ్చన్‌ ఐశ్వర్యారాయ్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే విధంగా వారిద్దరిని కలిపి చిత్రం చేయాలని మణిరత్నం భావించినట్లు సమాచారం.
 
అభిషేక్‌బచ్చన్‌ కూడా ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో గురు, రావణన్‌ హిందీ వెర్షన్‌ చిత్రాల్లో నటించారు. తాజా చిత్రం విషయమై మణిరత్నం అభిషేక్‌బచ్చన్‌ను కలిసి చర్చించినట్లు, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినా తాను, ఐశ్వర్య కలిసి నటించాలంటే అందుకు కథ సెట్‌ అవ్వాలని, అది చాలా ప్రత్యేకంగా ఉండాలని, అంతే కానీ తామిద్దం కలిసి నటించాలని ఏదో ఒక కథా చిత్రంలో నటించడం కుదరదని భావాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
మరి మణిరత్నం ఆ దంపతులను మెప్పించే కథను సిద్ధం చేస్తున్నారా అన్నది తెలియాల్సిఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments