Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అమ్మాయి ప్రేమలో అమీర్ ఖాన్, అందుకే కిరణ్ రావుకి విడాకులు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (19:39 IST)
ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారారు. తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, అతి త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు నెట్టింట సెటైర్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.
 
దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్‌కి కూతురుగా నటించిన నటి ఫాతిమా సన షేక్‌తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నారని.. అందువలనే ఆ నటికి తర్వాత చిత్రమైన "ది థగ్స్ అఫ్ హిందూస్తాన్" చిత్రంలో అమీర్ సరసన నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని తెలుస్తోంది.

ఫాతిమా ముంబైకి వచ్చిన ప్రతిసారి అమీర్‌ను ఖచ్చితంగా కలుస్తుందని, ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుస గుసలాడుతున్నాయి. ప్రస్తుతం 29 ఏళ్లు ఉన్న ఈ భామ 1992లో హైదరాబాద్‌లో జన్మించి 2016లో చాచి 420, వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో నటించింది.

1986లో రీనా దత్తాని పెళ్లి చేసుకొని సరిగ్గా 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్.. తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం  చేసుకొని అదే 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు. 56 ఏళ్ల వయసు ఉన్న అమీర్ ఖాన్ ఈ 29 ఏళ్ల భామను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments