Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా వాళ్లంటే అసలే పిల్లనివ్వట్లేదంటున్న హీరో ఎవరు?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా పని చేసే వారికి అమ్మాయిలను ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. కానీ, టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోకు మాత్రం ఆయన అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఆ హీరో

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (14:13 IST)
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా పని చేసే వారికి అమ్మాయిలను ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. కానీ, టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోకు మాత్రం ఆయన అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఆ హీరో ఎవరో కాదు.. ఆది పనిశెట్టి. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన 'మరకతమణి' ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆది విలేకర్లతో మాట్లాడారు. 
 
'ఆరు పాటలు, మూడు ఫైట్లు, కొన్ని గ్లామర్‌ సీన్లు ఉంటే సినిమా చూడాలని ప్రేక్షకులు అనుకోవట్లేదు. కొత్తదనం కోరుకుంటున్నారు. అది అందించే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఆ తరహా ఐడియాలజీ ఉన్న పాత్ర చేస్తున్నా. అది ఎలా ఉంటుందన్నది తెరపైనే చూడాలి' అని చెప్పారు. 
 
డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు చేస్తేనే కిక్కు ఉంటుంది. నా దగ్గరకి వచ్చేవన్నీ కొత్త కథలే. ‘సరైనోడు’కి, ఈ సినిమాకు సంబంధమే ఉండదు. దీని తర్వాత వచ్చే సినిమా ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను చేసే కథలతో కోట్లు ఇచ్చిన రాని సంతృప్తి కలుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న ‘రంగస్థలం’ హార్ట్‌ టచింగ్‌ సినిమా. ఆ సెట్‌కి వెళ్తుంటే 1985లో మా తాత ఇంటికి వెళ్తున్న ఫీలింగ్‌ కలుగుతుందన్నారు. 
 
ఈ యేడాది పెళ్లి చేసుకుని ఆ బ్యూటీఫుల్‌ జైల్‌ (లైఫ్)లోకి వెళ్లాలనుకుంటున్నా. ఫ్రాంక్‌గా, ప్లెయిన్‌గా ఉండే అమ్మాయి రావాలని కోరుకుంటున్నా. అస్సలు... సినిమా వాళ్లంటే పిల్లల్ని ఇవ్వట్లేదు. ప్రేమ కూడా ఉంటే అసలు రారు. హీరోగా కాకుండా నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి తారసపడితే ఆలోచిస్తానని ఈ యువ హీరో చెపుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments