Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యతో పాటు రాజశేఖర్‌తో చిందులేయనున్న సన్నీలియోన్.. ముంబై ఫిలిమ్ సిటీలో?

బాలయ్య శాతకర్ణికి తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ వుంటుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా సన్నీలియోన్‌తో నటు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (10:59 IST)
బాలయ్య శాతకర్ణికి తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ వుంటుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా సన్నీలియోన్‌తో నటుడు రాజశేఖర్ కూడా చిందులేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. "గరుడ వేగ" సినిమాతో మరోసారి రాజశేఖర్‌ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
చందమామ కథలు, గుంటూరు టాకీస్‌ చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘కరెంటు తీగ’లో నటించిన సన్నీ లియోన్‌ ‘గరుడ వేగ’లో ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ పాట కోసం ముంబై ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఈ సినిమా ఈ స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments