Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కబాలీలో 52 తప్పులు.. వీడియోను రిలీజ్ చేసిన డ్రీమ్ హౌజ్

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కబాలి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి రికార్డ్స్ నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాస్తూ కబాలి కేవలం ఫస్ట్ వీకెండ్‌లోనే తన సత్తా చా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (11:51 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కబాలి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి రికార్డ్స్ నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాస్తూ కబాలి కేవలం ఫస్ట్ వీకెండ్‌లోనే తన సత్తా చాటుకున్నాడు. ఇదంతా కేవలం ఒక్క రజినీ మేనియాతోనే సాధ్యం అయ్యింది. మరోవైపు సినిమా సక్సెస్ కావడంతో అటు తలైవా ఫ్యాన్స్ దగ్గర్నుండి సూపర్‌స్టార్ రజినీ వరకు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. 
 
గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజినీకాంత్ నటించి మెప్పించిన చిత్రంగా కబాలి రికార్డు సృష్టించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి తన వైపుకు తిప్పుకుంది. ఫ్యాన్స్, క్రిటిక్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. వయసు మళ్లిన డాన్ పాత్రలో రజినీకాంత్ అద్భుతమైన నటనను కనబరిచారు. 65 ఏళ్ల వయసులోనూ తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని నిరూపించారు. 
 
పా.రంజిత్ టేకింగ్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయింది. అయితే తాజాగా ఈ చిత్రంలో 52 తప్పులు ఉన్నాయని డ్రీమ్ హౌజ్ ఎంటర్‌టైన్మెంట్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్‌మెంట్ కోసం చేసిందే తప్ప మూవీని కించపరచాలనే ఉద్దేశంతో కాదని అంటున్నారు. ఇక  రోబో 2.0 సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొల్పిన రజినీ, ఫ్యాన్స్‌కు కబాలిని మించి అదిరిపోయే షాక్ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments