Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సుడిగాడు" సెన్సార్ సభ్యులకు షాక్..! బూతులే బూతులట..!!

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2012 (14:32 IST)
WD
తెలుగు వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఇవివి తనయుడు అల్లరి నరేష్ సినిమా అంటే నవ్వుల పండుగేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి మరో సినిమాతో నరేష్ ప్రేక్షకుల ముందుకు "సుడిగాడు"లా రానున్నాడు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందగా ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన సభ్యులు మాత్రం షాక్‌కు గురైయ్యారట. సినిమా చూస్తే షాక్ ఎందుకు తిన్నారని అనుకుంటున్నారా...?

ఈ సినిమా ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు పేరడీతో వస్తున్న కథాంశం అంటున్నారు. కాగా ఈ చిత్రంలో నరేష్ మితిమీరిన బూతు జపం చేశాడట. నరేష్ బూతుల్ని జనాలు తట్టుకొలేరంటున్నారు సెన్సార్ సభ్యులు. మరీ అభ్యంతరకరమైన కొన్ని సన్నివేశాలను తొలగించి, బూతులు ఎక్కువ ఉన్నచోట కీ....క్ సౌండ్‌లు పెట్టారట.

ఈ చిత్రం చూసిన వారికి బుగ్గలు, కడుపు నొప్పి రావడం కచ్చితమని సెన్సార్ సభ్యులలో ఒకరు చెపుతున్నారట. మొత్తానికి అల్లరి నరేష్ కామెడీ కాస్తా బూతు పురాణం చిత్రాలుగా మారుతున్నాయని టాలీవుడ్ సినీజనం తెగ చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Amaravati : అమరావతిలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం.. చంద్రబాబు ప్లాన్

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

Show comments