సినిమా నటిగా గతంలో తాను చేసిన పాత్రలు తాలూకూ ఛాయలు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా జయసుధను వీడటంలేదు. 1975లో ఆమె నటించిన మలయాళ చిత్రం తెలుగులో 'రాసలీలలు'గా వచ్చింది. దానిలో హీరోగా హ్యాండ్‌సమ్ హీరో కమల్‌హాసన్ నటించాడు.
అయితే ఇప్పుడు అదే పేరుతో కొత్త తారలతో సినిమా మలయాళంలో వస్తోంది. విశేషం ఏమంటే.. అప్పటి స్టిల్స్‌ను ఇప్పుడు పబ్లిసిటీకి వాడుకోవడంతో అవి నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్‌కు తగినట్లు మరింత ఘాటుగా అందులో సీన్స్ ఉండటంతో, అప్పటికీ ఇప్పటికీ అనే తేడాను చూపిస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు.
ప్రస్తుతం జయసుధ ప్రజా నాయకురాలిగా ఉన్న దశలో ఆమెకు ఇది మైనస్ కావచ్చని విమర్శకులకు ఇదొక ప్రచారాస్త్రంగా ఉంటుందని తద్వారా రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, సినిమా వేరు, రాజకీయం వేరు అనేది తేడా ఉన్నా... భవిష్యత్‌లో ఏమవుతుందో వెయిట్ అండ్ సీ..