Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ యముడు... 26న 'యమలీల 2' ఆడియో

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:54 IST)
రెండు దశాబ్దాల క్రితం కుటుంబ కథాచిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన 'యమలీల'ఎంతటి సంచలన విజయాన్ని సాధించింతో మనందరికీ విదితమే. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సీనియర్‌ ప్రొడ్యూసర్‌ అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.యస్‌.మ్యాక్స్‌ సమర్పణలో క్రిష్వీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై 'యమలీల2' రూపొందుతోంది. కలెక్షన్‌ కింగ్‌ డా||యం.మోహన్‌ బాబు యముడి పాత్రధారిగా, డా||బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డా||కె.వి.సతీష్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. దియా నికోలస్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. స్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ అక్టోర్ ‌26న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రేక్షకులు, అభిమానులు మధ్య ఘనంగా చేయనున్నారు.
 
ఈ సందర్భంగా కుటుంబ కథాచిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ''యమలీల చేసిన రెండు దశాబ్దాల తర్వాత యమలీల 2 చేయడం ఆనందంగా ఉంది. యమలీల సినిమాకు సంబంధం లేని కథతో కొత్తగా తెరకెక్కించాను. నేను కూడా కసితో, ఇష్టంతో సినిమాని కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దుతున్నాను. దీనికి మోహన్‌ బాబుగారు, బ్రహ్మానందంల సపోర్ట్‌ మరువలేనిది.  సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది'' అని అన్నారు.
 
అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమా కృష్ణారెడ్డిగారి స్టయిల్‌లో మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీగా తెరకెక్కింది. హీరో డా|| కె.వి.సతీష్‌ మాట్లాడుతూ- ''సినిమా నాకు కెరీర్‌ కాదు ఇంట్రెస్ట్‌. నేను సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పటివరకు బిజెనెస్‌ కారణంగా బిజీగా ఉండటంతో సినిమాల్లో నటించడానికి కుదరలేదు. ఈ సినిమాలో నేనే కాదు, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్‌బాబు, బ్రహ్మానందం అనే నలుగురు సూపర్‌ హీరోలు పనిచేశారు. ఒక టీమ్‌గా ఎంజాయ్‌ చేస్తూ సినిమాని కంప్లీట్‌ చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత మంచి సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది'' అని తెలిపారు.
 
కో-ప్రొడ్యూసర్‌ డి.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ఎంతో ప్లెజెంట్‌ వాతావరణంలో మా 'యమలీల-2' టాకీపార్ట్‌ కంప్లీట్‌ చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. తెలుగులో హై బడ్జెట్‌ చిత్రాల్లో ఒక చిత్రంగా 'యమలీల-2' రూపొందుతోంది. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ అక్టోర్‌ 26న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించనున్నాం. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం''అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments