Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగిడితే నాగచైతన్య పడిపోయాడా? క్లారిఫై చేసుకున్న జయసుధ!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:30 IST)
నాగచైతన్య హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నటించిన సినిమా 'ఒక లైలా కోసం'. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ కార్యక్రమంలో   హీరోయిన్‌ పూజా హెగ్డే, దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, నటులు సుమన్‌, సత్యం రాజేష్‌, మధునందన్‌, అమిత్‌కుమార్‌, నటీమణులు సుధ, అన్నపూర్ణ, శ్యామల, కెమెరామెన్‌ ఐ.ఆండ్రూ, గేయరచయిత పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. 
 
నటీనటులంతా సినిమా గురించి మాట్లాడుతూ.... ఆహా.. ఓహో.. అనడమేకాకుండా అన్నపూర్ణ బేనర్‌లో చేయడం అదృష్టమనీ, ఇలాంటి బేనర్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నామనీ తెగ పొగిడేశారు. 
 
తాత నుంచి మనవుడు నాగచైతన్య క్రమశిక్షణ, నటనతోపాటు మంచి అలవాట్లు పెద్దలను గౌరవించు నేర్చుకున్నాడంటూ తెగ పొగిడేశారు. మరలా నాగచైతన్యతో నటించాలనే కోరికను వ్యక్తం చేస్తూ... మరోసారి అవకాశం ఇవ్వడమని అడిగేశారు. 
 
అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ... ఇది లవ్‌స్టోరీయే కాదు, మంచి ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ మూవీగా అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్‌గుడ్‌ ఫామిలీ ఎంటర్‌టైనర్‌ రావాలంటే కంప్లీట్‌ ఫ్యామిలీ వుండాలి. థాంక్యూ టు 'ఒక లైలా కోసం' ఫ్యామిలీ. 
 
అన్నపూర్ణ స్టూడియోస్‌ 25వ చిత్రానికి ఇలాంటి ఫ్యామిలీ దొరకడం మా అదృష్టం. ఇదే ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చెయ్యాలని వుంది'' అన్నారు. అయినా.. నటి సుధ అనుమానం వ్యక్తం చేస్తూ... ఇదే ఫ్యామిలీ అంటే... మళ్ళీ మాతోనేగదా! అనే అనుమానాన్ని నివృత్తి చేసుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments