Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు పేరిట గ్రామీణ వైద్య సేవలు : హీరో మంచు విష్ణు

Webdunia
మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (11:54 IST)
తన తండ్రి, టాలీవుడ్ హీరో మోహన్ బాబు పేరిట 'డాక్టర్ మోహన్ బాబు రూరల్ హెల్త్ స్కీమ్'ను ప్రారంభించినట్టు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ స్కీమ్‌ను ఆయన సోమవారం తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో శిశు మరణాలను తగ్గించడ, గర్భిణులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, రకరకాల వ్యాధుల ప్రభావం నుండి గ్రామవాసులను కాపాడటం ఈ పథకం ముఖ్యోద్దేశమని చెప్పారు. 
 
ఇందుకోసం తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ స్కూల్‌కు చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ బృందాన్ని ఏర్పాటు చేయగా, ఈ బృందానికి 'ఆర్మీ గ్రీన్' అని పేరు పెట్టారు. ఈ బృందం విద్యార్థులు చంద్రగిరి మండలంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ స్కీమ్ వల్ల ఐదు గ్రామాల ప్రజలకు అనేక వైద్య ప్రయోజనాలు కలుగనున్నాయి. గ్రామస్థులకు వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు అవసరమైన మందులు కూడా అందచేస్తారు. 
 
ఒక్కో గ్రామస్థుడి మీద సుమారు 4 నుంచి 5 లక్షలు వరకు ఖర్చు పెట్టనున్నారు. మెరుగైన ఆరోగ్యం... ఆరోగ్యకరమైన జీవితం అనే స్టోగన్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంచు విష్ణు అన్నారు. ప్రస్తుతానికి ఐదు గ్రామాలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేశామని... వచ్చే ఏడాది ఆఖరు కల్లా చంద్రగిరి మండలంలోని అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments