Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రుద్రమ దేవి’ ట్రైలర్‌ డిసప్పాయింట్ గా ఉందా....?!!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (12:54 IST)
గుణశేఖర్ దర్శకత్వంలో చారిత్రక ఇతివృత్తంతో అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ‘రుద్రమదేవి' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఐతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో దాన్ని తెల్లారేసరికి 5 లక్షల మంది చూశారు. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డి పాత్రధారి అల్లు అర్జున్ సూపర్ అంటున్నారు కానీ గ్రాఫిక్స్ వీక్ గా ఉన్నాయనే కామెంట్లు వినబడుతున్నాయి. ఐతే కేవలం ట్రైలర్స్ ను బట్టి అంచనా వేయడం కరెక్టు కాదని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తమ్మీద రుద్రమదేవి ట్రైలర్ టాక్ పలు విధాలుగా వినబడుతోంది.

 
కాగా టాలీవుడ్ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో తెరకెక్కిస్తున్నరుద్రమదేవి సోమవారం సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ... పదేళ్ళనుంచి ఇండస్ట్రీలో ఏదో కొత్త ప్రయోగం చేయాలని ఎదురుచూస్తున్నాను. అది రుద్రమదేవితో నెరవేరింది. ఈ చిత్రంలో చేసినందుకు గర్వపడుతున్నానని తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన 3డి థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌ను హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను హీరోయిన్‌ అనుష్క లాంచ్‌ చేశారు. 
 
అనుష్క మాట్లాడుతూ... ట్రైలర్‌ అద్భుతంగా వుంది. సైనికులంతా ఈగిల్‌ షేప్‌లో చేసిన విధానం అద్భుతంగా వుంది. నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. గుణశేఖర్‌ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. రుద్రమదేవిగా నటించడం నేనెంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఇంతకుముందు నేను చేసిన సినిమాలను ఎంతో ఆదరించిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరించి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments