Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధమైన 'టామీ'... కుక్కలకే అంకితం...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (21:39 IST)
డా. రాజేంద్రప్రసాద్‌, సీత జంటగా బాబు పిక్చర్స్‌ సంస్థ రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో నిర్మించిన 'టామీ' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చేగొండి హరిబాబు, బోనం చినబాబు తెలియజేస్తున్నారు. ఈ సినిమాలో భూగీ అనే శిక్షణతీసుకున్న శునకం 'టామీ'గా ప్రధాన పాత్ర పోషించింది. 
 
ఈ సినిమా గురించి నిర్మాతలు చెబుతూ... జపాన్‌లో ఒకప్పుడు జరిగిన యథార్థ కథ ఆధారంగా చిత్రాన్ని నిర్మించాం. యజమాని పట్ల పెంపుడు కుక్కలకు ఎలాంటి విశ్వాసం వుంటుందో చిత్రంలో చూపించాం. ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషించడానికి రాజేంద్రప్రసాద్‌ అంగీకరించడం అదృష్టం. ఆయనా, భూగీ సినిమాలో పొటీపడి నటించారు. టామీ పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది. అయితే ఈ సినిమాను నిర్మించడానికి ఓ కారణముంది. 
 
నాకూ, నా భార్యకు కుక్కలంటే ఇష్టం. గతంలో మేం పెంచిన చిట్టు, చిన్ను అనే రెండు కుక్కలు మేం కనబడకపోతే తిండి తినేవి కావు. ప్రస్తుతం ఆ ముగ్గురినీ కోల్పోయిన నేను ఈ సినిమా తీసి వాళ్ళతోపాటు విశ్వాసపాత్రమైన కుక్కలన్నింటికీ ఈ సినిమా అంకితం చేస్తున్నాను' అన్నారు. ఎల్‌బి శ్రీరామ్‌, రఘుబాబు, వేణుమాధవ్‌, గీతాసింగ్‌, ముంతాజ్‌, లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: మోహన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బండారు బాబు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments