Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండుతున్న ఎండలు... విశాఖలో కంట్రోల్ రూం.. టోల్ ఫ్రీ నెంబరు!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (16:11 IST)
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో పిట్టలు రాలినట్లు ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఎక్కడ ఏ సమయంలో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం మొత్తం అప్పమత్తమైంది. 
 
ప్రజలను ఎండల బారి నుంచి రక్షించాలని సంకల్పించింది. తొలిసారి ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేసి దానికి 180042500002 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. తద్వారా వడదెబ్బ తగిలినా, ఎండలకు అత్యవసర సేవలు అవసరమైనా ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలపాలని అధికారులు సూచించారు.
 
అదేవిధంగా మండల ఎమ్మార్వోలంతా కలిసి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డీఆరోవో నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. నగర పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని గ్రేటర్ కమిషనర్కు కూడా లేఖ రాశారు. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి హామీ పనుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments