Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క అంటే నోర్మూసుకోవాలా...? నటుడు విశాల్ ఫైర్

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (15:44 IST)
తమిళనాడు చిత్ర పరిశ్రమలో లుకలుకలు బయటపడుతున్నాయి. తమిళ నిర్మాతల మండలిలో విభేదాలున్నాయనుకుంటే నడిగర్(నటుల) సంఘంలోనూ తేడాలు బయటపడ్డాయి. విశాల్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సంఘం నుంచి బహిష్కరిస్తాం అని తాజాగా నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై విశాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ... శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. నటుడిగా నేను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. కానీ నేను తప్పుగా మాట్లాడినట్లు సాక్ష్యాలు కూడా చెక్ చేసుకోకుండా నన్ను బహిష్కరిస్తానని అనడం దారుణం. అలా చేయదలిస్తే  రాధారవి, ఉపాధ్యక్షులు కెఎల్ కలైలను బహిష్కరించాల్సి ఉంటుంది.
 
వాళ్లిద్దరూ నటుల గురించి కుక్కలు అంటూ అవమానకరంగా మాట్లాడితే తప్పు లేదా అంటూ ప్రశ్నించారు. తనను బహిష్కరిస్తామంటూ వ్యాఖ్యానించిన పెద్దలు ముందుగా వారిపై ఓ నిర్ణయం తీసుకోవాలని విశాల్ చేసిన విజ్ఞప్తి ఇపుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments