Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి లిప్ లాక్ సీన్... రూ. 5 కోట్ల పారితోషికం తీసుకుంటుందా...?

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (15:22 IST)
సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రసీమను తన అందం, అభినయంతో ఏలిన బ్యూటీ క్వీన్, అతిలోక సుందరి, స్టార్ హీరోయిన్ శ్రీదేవి, బాలీవుడ్ ఫిలిమ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను పెళ్లాడిన తర్వాత 15 ఏళ్లుగా సినిమాల్లో నటించలేదు. ఆ తర్వాత ఇటీవలే ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ చిత్రం కూడా వచ్చి నాలుగేళ్లయిపోయింది. ఇప్పుడు తాజాగా తమిళ మూవీ ‘పులి'లో నటించడానికి ఓకే చెప్పిందట.

 

 
ఈ చిత్రంలో రాణిగా నటిస్తున్న ఆమె, కన్నడ నటుడు సుదీప్ (‘ఈగ’ ఫేమ్)తో లిప్ లాక్ ముద్దుసీనులో పాల్గొందట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 'ఇళయదళపతి' విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'పులి' చిత్రంలో శ్రీదేవి రాణిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా రాజు పాత్రలో సుదీప్ నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లిక్ లాక్ సన్నివేశాలు చిత్రానికే హైలైట్ గా నిలవనున్నాయని కోలీవుడ్ టాక్. కాగా ఇందులో విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్‌లు నటిస్తుండగా, వారిద్దరి కంటే శ్రీదేవి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటోందని సమాచారం. 
 
సీనియర్ నటి అయినప్పటికీ ఈ చిత్రంలో శ్రీదేవి యంగ్ హీరోయిన్లు హన్సిక, శ్రుతి హాసన్‌లతో పోటీ పడి నటిస్తున్నట్లు సమాచారం. అన్నట్టు లిప్ లాక్ ల నేపథ్యంలో శ్రీదేవికి భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించారని సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments