Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపుతో సినిమా తీయాలనుకున్నా కానీ: ఎస్పీబీ

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (12:07 IST)
బాపుతో తెలుగుదనం నిండిన సినిమా తీయాలని గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నానని.. దానికి కథా చర్చలు కూడా జరిగాయని, అయితే ఆయనతో సినిమా తీయాలనే తన కోరిక మాత్రం నెరవేరలేదని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బాపు దర్శకత్వంలో సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని... అయితే ఆ కోరిక నెరవేరకుండానే భగవంతుడు ఆయనను తీసుకెళ్లిపోయాడని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. బుధవారం ఉదయం విశాఖపట్నంలోని ఏయూ ప్లాటినమ్‌ జూబ్లీ అతిథి గృహంలో నిర్వహించిన బాపు శ్రద్ధాంజలి సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బాపుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 
 
బాపుకు రక్షణ కవచం రమణేనని, వారిద్దరిదీ విడదీయలేని అపురూప బంధమని అన్నారు. రెండు చేతులతో దీపం ఆరిపోకుండా కాపాడినట్టు, పుష్పం రేకులు రాలిపోకుండా చూసుకున్నట్టుగా బాపును రమణ అతి జాగ్రత్తగా కాపాడుకున్నారన్నారు. 
 
బాపుది పసి పిల్లవాడి మనస్తత్వమని... హిపోక్రసీ ఇసుమంతైనా లేని వ్యక్తి అని బాలు తెలిపారు. మాటల్లో సంక్షిప్తత, ఉదాత్త స్వభావం బాపు సొంతమన్నారు. 
 
బాపుకు సంగీతమంటే ప్రాణమని, ఎప్పుడు కలిసినా తనతో పాటలు పాడించుకుని ఆనందించేవారని ఆయన తెలిపారు. మంచి సాహిత్యం ఉన్న పాటల కోసం బాపు తన సినిమాల్లో ఎన్నోసార్లు సన్నివేశాలు పెంచిన సందర్భాలు ఉన్నాయని వివరించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments