Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో స్నేహా: ప్రెగ్నెంట్‌గా లేనని క్లారిటీ!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:07 IST)
హోమ్లీ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకున్న స్నేహ.. తాజాగా అల్లు అర్జున్ సినిమాలో నటించనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమెను ఓ కీలక పాత్రకు ఎంచుకున్నారు.
 
ఈ విషయాన్ని తాజాగా స్నేహ కూడా ధృవీకరించింది. ఇందులో ఇప్పటికే సమంత, ఆదా శర్మ హీరోయిన్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. 
 
తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత స్నేహ అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ' సినిమాలో కూడా నటించింది. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు.
 
మరోవైపు మీడియా తన మీద లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోందని స్నేహ వాపోతోంది,   స్నేహ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్‌లో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అంతేకాదు, వచ్చే ఏడాది మొదటి భాగంలో అమ్మడికి డెలివరీ డేట్ కూడా ఇచ్చారంటూ రాసేశారు.
 
దీంతో స్నేహ చాలా అప్సెట్ అయింది. ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ కానని పేర్కొంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాననీ, అప్పుడే పిల్లల్ని కనే ఉద్దేశం కూడా లేదనీ చెప్పింది. ఇలా అనవసరమైన వార్తలు ప్రచారం చేయద్దని స్నేహ వేడుకుంటోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments