Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయని సునీతకు గౌరవం దక్కింది.. ఇంతకన్నా ఏం కావాలని అంటోంది...

Webdunia
బుధవారం, 30 జులై 2014 (20:52 IST)
గాయని సునీత అంటే తెలియనివారు లేరు. ఆమె వాయిస్‌ను పలు అగ్ర హీరోయిన్లకు అరువుగా ఇస్తుండేది. అయితే వాయిస్‌లో కొంచెం స్లోనెస్‌ వుండటంతో అది కొందరికే సరిపోయింది. ఇప్పుడు చాలామంది యువతులు గాయనీమణులుగా చెలామణి అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. పోటీ వుంది. అయినా తనకు ఏమీ ఢోకా లేదని సునీత చెబుతుంది. 
 
పలుసార్లు విదేశీ ప్రోగ్రామ్‌లకు అటెండ్‌ అయి బహుమతులు గెలుచుకుంది. బాలసుబ్రహ్మణ్యం ఆమె వాయిస్‌ను ప్రోత్సహిస్తుంటారు. ఇలా ఇండస్ట్రీలో పలువురి ప్రోత్సాహం వున్న సునీతకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గాయి. దానిపై ఆమె మాట్లాడుతూ... అటువంటిది ఏమీలేదు. 
 
తెలుగులో కాకపోతే.. ఇతర భాషల్లోనూ, మిగిలిన ప్రోగ్రామ్‌లలోనూ బిజీగా వున్నానని చెబుతుంది. ఇటీవలే మిర్చి మ్యూజిక్‌ అవార్డుల కార్యక్రమానికి ఆమెను జ్యూరీగా ఎంపిక చేశారు. ఇంతకన్నా తనకు ఏమి కావాలని అదే పెద్ద గుర్తింపు అంటోంది. ఆగస్టు 16న అన్నపూర్ణ స్టూడియోలో ఈ అవార్డుల కార్యక్రమం జరుగనుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments