Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాద్రిపురం పాటలు వచ్చాయ్‌

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (20:59 IST)
తెలుగమ్మాయి అంజలి కథానాయకిగా తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన 'తమ్మివెటైత్తె సుందరం' చిత్రం 'సింహాద్రిపురం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీపూర్ణి క్రియేషన్స్‌ పతాకంపై పి.వి.అశోక్‌కుమార్‌ సమర్పణలో బళ్లారి సాగర్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బళ్లారి ఈశ్వరప్ప నిర్మాణ సారధ్యం వహించారు. డి.నారాయణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం, హైద్రాబాద్‌ ఫిలించాంబర్‌లో జరిగింది.
 
'చంద్రముఖి' ఫేం విద్యాసాగర్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... 'అంజలి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమా కొందామని పోటీపడిన వాళ్లలో నేనూ ఒకడిని. ఈ సినిమా ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా మారుతున్న డి.నారాయణ నాకు బాగా కావాల్సినవారు. 'సింహాద్రిపురం' సినిమా మంచి విజయం సాధించి చిత్ర నిర్మాతలకు మంచి లాభాలను తీసుకురావాలని కోరుకొంటున్నాను' అన్నారు.

 
చిత్ర నిర్మాత బళ్లారి సాగర్‌ కుమార్‌ మాట్లాడుతూ... 'తమిళంలో చాలా పెద్ద హిట్‌ మూవీ ఇది. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకంతో అనువదిస్తున్నాం. 'చంద్రముఖి' ఫేం విద్యాసాగర్‌గారి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది' అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ డి.నారాయణ మాట్లాడుతూ... 'అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
 
'సింహాద్రిపురం' చిత్రానికి నిర్మాణ సారధ్యం వహించిన బళ్లారి ఈశ్వరప్ప మాట్లాడుతూ... 'తుమ్మలపల్లి రామసత్యనారాయణగారు ఈ ఆడియో వేడుకకు విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ కూడా సమపాళ్లలో ఉన్న సినిమా ఇది. తెలుగులో తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు. అంజలి, కరణ్‌, దండపాణి, కంజికడపు తదితరులు నటించిన ఈ చిత్రానికి వడివుడియాన్‌ దర్శకుడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments