Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ: మరాఠీలో సినిమా.. సమీర్‌కు స్పెషల్ పర్మిషన్!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (18:17 IST)
బావల సయ్యా, మరదల సయ్యా అంటూ తెలుగు ప్రేక్షకులనే గాకుండా యావత్తు చిత్ర సీమల్ని ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత.. మరణించినా కూడా కోట్ల వర్షం కురిపిస్తోంది. సిల్క్ స్మిత జీవిత కథ ప్రస్తుతం ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయ్యింది. బాలీవుడ్ తార విద్యాబాలన్‌కు గ్లామర్ క్వీన్ అనే పేరు, అవార్డులు సంపాదించి పెట్టిన సిల్క్ స్మిత జీవిత కథ డర్టీ పిక్చర్ గురించి అందరికీ బాగా తెలిసే వుంటుంది. 
 
సెక్సీ క్వీన్‌ అయిన సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ వసూళ్ల వర్షం కురిపించడంతో మలయాళం, కన్నడంలోనూ సిల్క్ లైఫ్ స్టోరీ సినిమాగా తెరకెక్కించిన దర్శకులు లైఫ్‌లో సెటిలైపోయారు. ఇదే తరహాలో తాజాగా సిల్క్ జీవిత కథతో మరాఠీలో చిత్రం రూపొందుకోనుంది. సమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో సిల్క్ స్మిత అందాలకు ఏమాత్రం తగ్గనీయకుండా ఈజీగా మనీ సంపాదించడానికి రెడీ అయ్యారు. 
 
ఇందుకోసం సిల్క్ స్మిత కుటుంబీకుల వద్ద స్పెషల్ సమీర్ పర్మిషన్ కూడా తీసుకున్నాడు. అంతేకాదు.. సిల్క్ స్మిత జీవిత ఆధారంగా ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ వివిధ కోణాల్లో తెరకెక్కాయని, తాము తీసే చిత్రం ఫుల్ అండ్ ఫుల్ సిల్క్ స్మిత జీవిత కథేనని సమీర్ ఖాన్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలో మరాఠీ నటీమణి సిల్క్ పాత్రలో కనిపించబోతోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు