Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ కెమెరా ముందుకు శ్వేతాబసు!.. హన్సల్ మెహతా ఛాన్స్‌...

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (10:05 IST)
సంచలనాల హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ కెమెరాముందుకు వస్తోంది. ఓ హోటల్లో దొరికిన ఆమెపై పోలీసులు వ్యభిచారం కేసు పెట్టి రెస్క్యూహోంకు పంపడం, కోర్టు జోక్యం చేసుకుని ఆమెను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పట్లోనే శ్వేతాబసు చెప్పింది.
 
మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె ముఖానికి రంగేసుకుని ఓ డాక్యుమెంటరీతో కెమెరా ముందుకు రాబోతోంది. జాతీయ అవార్డు విజేత హన్సల్ మెహతా తన స్వీయ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో శ్వేతాబసుకు అతి కీలకపాత్ర ఇచ్చినట్లు సమాచారం. 
 
త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. రెస్క్యూహోం నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడే, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని శ్వేతాబసు తెలిపింది. ఆ ప్రకారంలో మెహతా ఇచ్చిన అవకాశాన్ని శ్వేతా అందిపుచ్చుకుంది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments