Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్‌ 'గెలుపుగుర్రం' వచ్చేస్తోంది!

Webdunia
శనివారం, 5 జులై 2014 (17:43 IST)
'గబ్బర్‌సింగ్‌, బలుపు, ఎవడు, రేసుగుర్రం' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో హీరోయిన్ల రేసులో యమ స్పీడ్‌తో దూసుకుపోతూ.. ప్రస్తుతం 'ఆగడు' సినిమా కోసం మహేష్‌ బాబుతో ఖతర్నాక్‌ ఐటం సాంగ్‌ చేస్తున్న శ్రుతిహాసన్‌ హిందీలో నటించిన 'డి-డే' అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'గెలుపుగుర్రం' పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ వేశ్యగా నటించి ఉండడం విశేషం. సి.ఆర్‌.రాజన్‌ సమర్పణలో.. 'డర్‌ సినిమా' మరియు 'సురేష్‌ సినిమా' బ్యానర్స్‌పై సురేష్‌ దూడల ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. 
 
డ్రగ్స్‌ మరియు మాఫియా నేపధ్యంలో.. నిఖిల్‌ అద్వాని దర్శకత్వంలో రూపొంది.. హిందీలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌, ఇర్ఫాన్‌ఖాన్‌, రిషికపూర్‌, అనిల్‌కపూర్‌, నాజర్‌, హుమా ఖురేషి వంటి హేమాహేమీలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 'కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, విశ్వరూపం' చిత్రాలకు సంగీతాన్ని అందించి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన సంగీత త్రయం 'శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌' స్వర సారథ్యం వహించిన 'గెలుపుగుర్రం' ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా 'గెలుపుగుర్రం' నిర్మాత సురేష్‌ దూడల మాట్లాడుతూ.. ''వేశ్య పాత్రలో చాలా బోల్డ్‌గా శ్రుతిహాసన్‌ యాక్ట్‌ చేసిన హాట్‌ సీన్స్‌ 'గెలుపు గుర్రం' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రముఖ నటులు నాజర్‌ ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషించారు. 'రేసుగుర్రం' అనంతరం 'గెలుపుగుర్రం'పై వస్తున్న శ్రుతిహాసన్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. ఈనెల 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు!! 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments